వపా శతవసంతాల ప్రత్యేక సంచిక..!

వపా అభిమానులకు కానుక …! వపా శతవసంతాల ప్రత్యేక సంచిక…!
అమర చిత్రకారుడు, కార్టూనిస్ట్, రచయిత వడ్డాది పాపయ్య శతజయంతి సంవత్సరం (1921-2021) సెప్టెంబర్ 10న ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా ‘వపా ‘ కు ‘వంద ‘నం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు సంవత్సరం పాటు (2021 సెప్టెంబర్-10 వరకు) నిర్వహించతలిచాము. వేలాదిగా వున్న వపా అభిమానులు ఈ కార్యక్రమానికి సహకరించవలసినదిగా కోరుచున్నాం. వపా కు సంబంధించిన చిత్రాలు, కార్టూన్లు, కథలు, వ్యాసాలు మాకు పంపించ కోరుతున్నాం.
కార్యక్రమ వివరాలు:
1. వపా శతవసంతాల ప్రత్యేక సంచిక ముద్రణ
2. వపా కార్టూన్లు ప్రచురణ
3. వపా కథలు ప్రచురణ
4. వపా చిత్రకళా ప్రదర్శన (ఒరిజినల్స్) ఏర్పాటు
5. వపా స్మారకోపన్యాసం ఏర్పాటు
6. వపా విగ్రహం ఏర్పాటుకు (విశాఖపట్నంలో) కృషి
7. వపా ఆర్ట్ గ్యాలరీ కి యత్నం
పై కార్యక్రమాలు జయప్రదం కావడానికి వపా అభిమానులు తగిన సూచనలు, సలహాలు అందజేయాల్సిందిగా కోరుతున్నాం.
సుంకర చలపతిరావు
చిత్రకళా పరిషత్, విశాఖపట్నం(91546 88223)

కళాసాగర్ యల్లపు
ఎడిటర్ :64కళలు.కాం (www.64kalalu.com) (98852 89995)
email: artistkalasagar@gmail.com