Vaddadi Papaiah @101 Anniversary
(*సెప్టెంబర్ 10 వడ్డాది పాపయ్య గారి జయంతి.)
*వడ్డాది పాపయ్య (1921) చిత్రకళకుఆకాశమే హద్దు….!!
1921, సెప్టెంబర్ 10, న శ్రీకాకుళం లో జన్మించిన వడ్డాది
పాపయ్య గారి చిత్రకళకు ఆకాశమే హద్దు.ఆయన కుంచె
కు తెలీని ఒంపు సొంపులు లేవంటే అతిశయోక్తికాదు
స్వయంకృషితో చిత్రకళను అభ్యసించి లోకాన్ని అబ్బుర
పరిచారు.1926లో తన తొలిచిత్రం హనుమంతుడితో
చిత్రకళాజగత్తులో అడుగు‌పెట్టారు.కాశీనాథుని నాగేశ్వర
రావు పంతులు,చక్రపాణి గార్లప్రోత్సాహంతో చందమామ
యువ పత్రికల్లో ఆర్టిస్ట్ గా ఓ వెలుగు వెలిగారు.
భారతదేశానికి గర్వకారణమైన చిత్రకారుడు వడ్డాది
పాపయ్య గారు. ప్రాచీన సాహిత్యాన్ని అకళింపు చేసు
కొని తన కుంచెకు సాహితీ సౌరభాన్ని పులిమి చిత్రాల
ను చిత్రించిన అరుదైన చిత్రకారుడు వడ్డాది పాపయ్య
గారు.ప్రతీ గీతకూ అర్థం ఉంటుంది.ప్రతీరూపానికీ..
ఆహ్లాదం ఉంటుంది. కొన్ని స్ట్రోక్స్ కలసి రూపంఅవుతుం
దని‌ తన బొమ్మలతో నిరూపించారు
వడ్డాది పాపయ్య గారికి ఆధునిక చిత్రకళ అంటే..
ఎంతో ఇష్టం.తనజీవితకాలంలో లెక్కలేనన్ని బొమ్మ
లు వేశారు.’కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి
పద్యాల స్ఫూర్తి తో ..పాపయ్య గారు గీసిన చిత్రాల
గురించి ఎంతచెప్పినా తక్కువే.
క్యూపిడిజమ్,సింబాలిజం సృష్టి ఆయన ప్రత్యేకత.
ఆయన 010 సైజు కుంచెను ఎక్కువగా ఉపయో
గించే వారు.ఆయన కుంచె పేర్లు*పావనం.*వపా,
ఇంత గొప్ప చిత్రకారుడి అభిమానాన్ని చూరగొన్న
చిత్రకారులూ వున్నారు. వారు ఇంద్రాస్ (ఫ్రెంచ్),
దామెర్ల,సి.వెంకట్రావ్..మజుందార్,అంబాశంకర్,
జామినీరాయ్.. ప్రభృతులు.!!
వడ్డాది పాపయ్య గారికి అత్యంత ఇష్టమైన మోడల్
‘స్త్రీ ‘. ఇష్టమైన చిత్రం”రాజా రవివర్మ” వేసిన’శ్రీరామ
పట్టాభిషేకం ‘ చిత్రం.ఇష్టమైన గ్రంథం..పోతన గారి ‘
భాగవతం’..!!
ఆయనకు ఇష్టం లేనివి ‘ ప్రచారం, ప్రశంస, వ్యక్తి
ప్రాముఖ్యత.’ తన గురించి లఘుచిత్రం తీయాలన్న
దూరదర్శన్ ప్రతిపాదనను తిరస్కరించారు. కళాకా
రునిగా తనను అభిమానించవద్దని, తన కళనే అభి
మానించమని, అభిమానులను వ.పా. కోరేవారు.
కేవలం మిత్రుల వత్తిడి కారణంగా ఖరగ్‌పూర్,శ్రీకాకు
ళంలలో తన చిత్రాలను ప్రదర్శనకు ఉంచారు.
*తండ్రే గురువు…!!
తండ్రి చిత్రకళా ఉపాధ్యాయుడు కావడంతో ‘ చిత్ర
కళ ‘ లోని ఓనమాలను తన తండ్రి వద్దనే నేర్చి
తండ్రి బొమ్మలు గీచే పద్ధతిని చాలా శ్రద్ధతో పరిశీ
లించేవారు. క్షుణ్ణంగా అవగాహన చేసుకొని,పట్టు
దలతో సాధన చేశారు.రంగులు కలపడం, వాటిని
ఉపయోగించే పద్ధతిని తండ్రి వద్దనే నేర్చుకున్నారు.
తన తండ్రి బొమ్మలు వేస్తున్నంతసేపూ ఆయన దీక్ష
గా పరిశీలించేవారు. అలా చిత్రకళలోని మెళకువల
ను ఆకళింపు చేసుకున్నారు.
పాపయ్య చిన్న తనంలో తండ్రికి భారత,భాగవతాల
ను వినిపిస్తుండేవారు. ఆ ప్రభావం వలన పాపయ్య
ఆధునికత కంటే ప్రాచీనత మీద, ముఖ్యంగా భారతీ
య శిల్ప, చిత్ర కళల మీద మక్కువ పెంచుకొన్నారు
ఐదు సంవత్సరాల వయసులోనే తన ఇంటిలో ఉన్న
రవివర్మ చిత్రం ‘కోదండ రామ’ను ప్రేరణగా తీసుకుని
హనుమంతుని చిత్రాన్ని (1962 )గీసారు.
చిత్రకళ నేర్చుకొంటున్న తొలినాళ్ళలో దేశోద్ధారక
కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు పాపయ్య
చిత్రాలు పత్రికలలో ప్రచురించి ప్రోత్సహించారు.
ఆ తరువాత వ.పా రేరాణి, మంజూష, అభిసారిక,
ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్రజ్యోతి తదితర పత్రికల
లో చిత్రాలు గీయటం ప్రారంభించారు.
ఎగురుతున్న హనుమంతుడు, గోపికాకృష్ణుల‌ రాస
లీల వంటి ఎన్నెన్నో ‌అతిరమణీయ చిత్రాలతో పాటు
పార్వతి, శకుంతల,లక్ష్మి,ధనలక్ష్మి, శివపార్వతులు,
గంగావతరణం మొదలైన పౌరాణిక ,ఊహాత్మక
బొమ్మలను గీశారు. రేరాణి, అభిసారిక, భారతి
పత్రికలలో ప్రచురితమైన బొమ్మలలో ఒక సంచలన
చిత్రకారుడుగా పత్రికా ప్రపంచానికి చేరువయ్యారు
తత్ఫలితంగా తెలుగు సినీ ప్రముఖుడు చక్రపాణి తమ
సంస్థ ప్రచురణలైన ‘ చందమామ ‘యువ’ పత్రికలలో
బొమ్మలు వేసే ఉద్యోగం ఇచ్చారు. ఒక్క ‘చందమామ’
పత్రికలోనే దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఒకే
పత్రికలో కొనసాగటం విశేషం.
కొంతకాలం తరువాత చందమామ సంపాదకులు
చక్రపాణి పరిచయంతో దాదాపు అర్ధ శతాబ్దం పాటు
చందమామను తన కుంచెతో తీర్చి దిద్దాడు.అప్పట్లో
చందమామ ఎనిమిది భాషల్లో వెలువడుతుండటం
తో పాపయ్య చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రచారంపొందా
యి. యువ మాసపత్రికలో చిత్రకారులు ఒక చిత్రం
గీసే అవకాశం అరుదుగా వచ్చే రోజులలో నెలకు
నాలుగు ఐదు చిత్రాలు గీసేవారు వడ్డాదిపాపయ్య.
చందమామ, యువ తర్వాత స్వాతి వార, మాస
పత్రికలలో దశాబ్దకాలం పైగా ఈయన చిత్రాలు
ప్రచురించబడ్డాయి.
వడ్డాది పాపయ్యగారు గీసిన చిత్రాల క్రింద ‘వ.పా.’
అనే పొడి అక్షారాల సంతకం వారి ప్రత్యేకత.
వీరి బొమ్మలకు గల మరొక కుంచె గుర్తు ‘0|0’ అని
వుండడం. ఇందు గురించి ఆయన చెప్పిన భాష్యం ..
“గతం శూన్యం, వర్తమానం శూన్యం,
భవిష్యత్తులో నిలుచున్నానని”….!!.
చాలామంది కి తెలియని విషయం..వ.పా. కేవలం
చిత్రకారుడే కాదు.రచయిత కూడా. చందమామలో
కొడవటిగంటి కుటుంబరావు మొదలు పెట్టిన ‘దేవీ
భాగవతం’ కథలను పూర్తి చేసింది ఆయనే.’విష్ణుకథ’
పౌరాణిక సీరియల్ కూడా ఆయన వ్రాసిందే.
తన చిత్రాల ద్వారా ఎందరో అభిమానులను ‌సంపా
దించుకున్నారు వ.పా. అయితే కొందరు విమర్శకు
లు వ.పా. చిత్రకళా శైలిని” పట చిత్రకళ” Calendar
Art…అని విమర్శించేవారు.
అతి సామాన్యమైన రంగుల్లోంచి అత్యద్భుతమైన
బొమ్మలను , ఇంద్రధనుస్సులో కూడా కానరాని
రంగుల కలయికనూ చూపగలిగిన వడ్డాది పాపయ్య
కళాజీవితం ఎంతో ఉన్నతమైంది.పల్లె పడతుల అంద‌
చందాలను, స్నిగ్ద మనోహర వలపుతలపులను
చిత్ర కళాకారు లు ఏనాటి నుంచో చిత్రీకరించినా
వ.పా శైలి మాత్రం అజరామరంగా నిలిచి పోతుంది.
కేవలం కళాజీవితమే కాదు.ఆయన వ్యక్తిగతజీవితం
కూడాఅంతే గొప్పది.
మత్స్య గ్రంధి, ఊర్మిళనిద్ర, పంచతంత్రం కథలలోని
జంతు ప్రపంచం ఈయన కుంచె కదలికలతో జవ
జీవాలు నింపుకొని కళాభిరుచి గూర్చి తెలియని
పాఠకుల్ని సైతం కళాభిమానులుగా తీర్చిదిద్దాయి.
తెలుగు నాట చిత్రకళలో ఈయన శైలికి, బొమ్మల
లోని సంతకానికి అందినంత గుర్తింపు గౌరవ ప్రతి
ష్టలు మరెవరికీ అందలేదనే చెప్పాలి. ‌రూప కళను
అమితంగా ఇష్టపడే వ.పా. నైరూప్య (Abstract Art)
చిత్రకళ పట్ల తీవ్ర అసహనాన్ని ప్రదర్శించేవారు.
*ఆధునిక చిత్రకళ గురించి…
‘వడ్డాది పాపయ్య’ గారి మాటలు..!!
ఆర్టిస్టులంటే ఆమాట ఇంగ్లీషు మాట కాబట్టి…..
ఆర్టిస్టులు ‘ అనబడేవారికి చాలామంది అనుకునే
లక్షణాలన్నీ వర్తిస్తాయి.’చిత్రకారులు’ అనిపించు
కున్న వారిలో కొందరికే ఆ బండ గుర్తులు వర్తించ
వచ్చు గానీ…అందరికీ ఒకే బండ సరికాదు.
ఆధునిక లేదా నవీన చిత్రకళా అంటే “ఇదీ ” అని
లేదు.ఈ రోజు నవీనం రేపటికి పాత్రులై పోతుండగా
ఒక వంక కంప్యూటర్ల చేత డ్రాయింగులు చేస్తూంటే
మరో వంక కలర్ ఫొటోగ్రఫీ ట్రిక్కులతో అన్నీ సాధిస్తు
న్న ఈ చిత్రకళ అంత్య యుగంలో ఏదో ఒక స్టాంపు
చేస్తేనే గానీ గుర్తింపు రాదు.అది ఎలాంటిదైనా..ఏదో
ఒక సాహసం లేదా గారడీ గరిడీలు తప్పనిసరి.పాత
పునాది మీద కొత్త చూపించినా, పూర్తిగా పాత్రను
కూలదోసి మరోవినూత్నం తెచ్చినా..ఆధునిక కళ
కంటే మరో మార్గం లేదు.నా మట్టుకుచెప్పాలంటే
మనుగడ కోసం సాంప్రదాయికంగానే బొమ్మలు
వేస్తున్నా.(ఈ దేశంలో ఆధునిక చిత్రకళకు పైసా
సంపాదించే యోగం లేదు కాబట్టి)…(మిత్రుడు
చలపతిరావు కు 21.6.1982లో లో.వపా.రాసిన
ఓ లేఖనుంచి)
లోకానికి తెలియకుండా తనను తాను ఏకాంతంలో
బంధించుకొని మరెవరూ దర్శించలేని దివ్య దేవతా
రూపాలను చిత్రించిన పాపయ్య గారు 1992 –
డిసెంబర్ 30 న దివ్యలోకాలకు వెళ్ళిపోయారు.
16.9.2020 లో ఆయన శతజయంతి ఉత్సవాలు
జరిగాయి.!!
*ఎ.రజాహుస్సేన్..!!

Courtesy Mr. Abdul Rajahussain