SP Balasubrahmanyam passes away at age 74
సినిమా పాటల గాయకుడిగా ప్రఖ్యాతిచెందిన పద్మభూషణ్ , పద్మశ్రీ ,గానగంధర్వ,డా౹౹ కీశేశ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారు జూన్ 4, 1946న నెల్లూరతేదీ తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన పూర్తిపేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. సంక్షిప్తంగా ఈయన బాలుగా, ఎస్పీబిగా ప్రసిద్ధి చెందారు. తండ్రి ఎస్పీ సాంబమూర్తి హరికథ కళాకారుడు, సోదరి ఎస్.పి.శైలజ గాయనిగా ప్రసిద్ధి చెందింది. 17 భాషలలో కలిపి 41,000కుపైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డు సృష్టించిన బాలసుబ్రహ్మణ్యం ఎన్నో జాతీయ, రాష్ట్ర సినీ అవార్డులు, భారత ప్రభుత్వంచే 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ పురస్కారాలు స్వీకరించారు.
గాయకుడిగా ప్రస్థానం:
గాయకుడిగా ఎస్పీ తొలి సినిమా శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న (1966). సంగీత దర్శకుడు ఎస్.పి.కోదండపాణి వల్ల నటుడు, నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంలో ఈయనకు తొలిసారిగా సినీగాయకునిగా అవకాశం లభించింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషలలో కాకుండా 16 భాషా సినిమాలలో పాటల ద్వారా తన గానాన్ని వినిపించారు. నటుడిగా కూడా బాలు కొన్ని సినిమాలలో నటించారు. ఈటీవి పాడుతా తీయగా కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించారు. ఈటీవి స్వరాభిషేకం కార్యక్రమంలో కూడా గానాన్ని వినిపించారు
పురస్కారాలు:
బాలసుబ్రహ్మణ్యం తన గానం ద్వారా 6 ఫిలింఫేర్ అవార్డులను, 25 సార్లు నంది అవార్డులను, 6 ఫిలింఫేర్ సౌత్ అవార్డుల, ఒకసారి జాతీయ ఫిలిం అవార్డు, తమిళనాడు, కర్ణాటకకు చెందిన పలు రాష్ట్ర అవార్డులు పొందారు. ఫిలింఫేర్ అవార్డులను 6 సార్లు పొందగా అందులో 3 అవార్డుకు తెలుగు సినిమాలకు చెందినవి (శంకరాభరణం, సాగరసంగమం, రుద్రవీణ). 6 సార్లు ఫిలింఫేర్ సౌత్ అవార్డులు పొందగా అందులో 2 తెలుగు సినిమాలకు చెందినవి (శుభసంకల్పం, శ్రీరాముడు). 1989లో మైనే ప్యార్ క్యా సినిమాకై బాలు జాతీయ ఫిలిం అవార్డు, 2012లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు పొందారు. 2016లో 47వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా జీవితసాఫల్య అవార్డు పొందారు.
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్యణ్యం ఈ ఏడాది ఫిబ్రవరిలో తన సొంతింటిని కంచి పీఠానికి విరాళంగా ఇచ్చారు. తన తండ్రి శైవభక్తులు కాగా, ఎంతో గురుభక్తితో ఉండేవారని బాలు చెప్పారు. వారు లేరనే అసంతృప్తి తప్ప వారి పేరుతో వేదపాఠశాలను నిర్వహించటం ద్వారా వారు ఇక్కడే ఉన్నారని భావిస్తాం. కంచి పీఠానికి నేను గృహాన్ని అప్పగించలేదు.. భగవత్‌ సేవకు స్వామివారే తీసుకున్నారనేది సబబు అనడం బాగుంటుంది అని బాలసుబ్రహ్మణ్యం ఆ సందర్భంలో పేర్కొన్నారు.
ప్రస్తుత మహమ్మారి కోవిడ్ 19 సోకి 52 రోజులు సుధీర్గ పోరాటం చేసి 25-9-2020 వ తేదీన అశేష అభిమానులు నిరాశపరుస్తూ చెన్నైలోని ఎమ్.జి.ఎమ్ ఆసుపత్రిలో మధ్యాహ్నం 1 గంటల 4 నిమిషాలకు స్వరరాజు గానగంధర్వుడు దివికేగారు.
సీనీగాయకుల జగత్తులో ఒక శకం ముగిసింది .
కుటుంబం:
భార్య సావిత్రి, కుతూరు పల్లవి, కుమారుడు ఎస్.పి.చరణ్ (ఈయన కూడా గాయకుడు, దర్శకుడు). సొదరి ఎస్.పి.శైలజ కూడా గాయనిగా ప్రసిద్ధి చెందారు..
Courtesy: All Famous Artists from India