
అర్ధరాత్రి దాటింది. ఆరు బయట నిద్రిస్తోన్న వామనరావుకు సన్నగా మూలుగు వినిపించింది. ఉలిక్కిపడి నిద్ర లేచాడు. కాస్త దూరంగా మోకాళ్ళపై తలాన్చుకొని వెక్కివెక్కి ఏడుస్తోంది పారిజాతం. అదిరిపడ్డాడు వామనరావు. గబుక్కున్న లేచి పారిజాతం దగ్గరకు వెళ్ళాడు కాస్త స్పీడుగా. పారిజాతం భుజం తట్టాడు. తలెత్తలేదు పారిజాతం. కాస్త అనునయంగా తలను పైకి లేపి “ఏమైంది పారూ”. అని అడిగాడు. ఇంకొంచెం ఎక్కువైంది పారిజాతం ఏడుపు. కంగారు పడ్డాడు వామనరావు. “ఏడవకే… పిల్లలు లేస్తారు… కంగారు పడతారు వాళ్ళు” అనునయించి, విషయం చెప్పమని అడిగాడు. దుఃఖాన్ని దిగమింగుకుంటూ చెప్పింది “కలొచ్చింది వాము… మనం చేరబోయే ఇంటికి దరిదాపుల్లో పోస్టాఫీసు లేదు..” ఖంగు తిన్నాడు వామనరావు. “కలే కదా పారూ… మనం ఎక్కడ చేరినా పోస్టాఫీసుకు దగ్గరలో చేరుదాం… పిల్లలకు ఆ విషయం తెలుసు… ఆ దిశగానే వాళ్ళూ ఇళ్ళు వెతుకుతున్నారు” అనునయిస్తూ చెప్పాడు వామనరావు. నిజమా అన్నట్లు చూసింది పారిజాతం. అవునన్నట్లు తలూపుతూ… “రా పడుకుందూ గాని…” అంటూ తీసుకెళ్ళి పడుకోబెట్టి భుజాలవరకు దుప్పటి కప్పి తానూ పడుకుని ఆకాశం వంక చూశాడు. గతం గిర్రున తిరిగింది..
డిగ్రీ ఫైనలియర్ చదివేటప్పుడే వామనరావుతో పెళ్ళి కుదిరింది పారిజాతానికి ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఇంజనీర్ గా పనిచేసేవాడు వామనరావు. కాలేజీ వార్షిక మాగజైన్స్లోలో కథలు రాసేది పారిజాతం. అందరూ ఎంతో మెచ్చుకునేవాళ్ళు. చదువు అటకెక్కిది. కథ మాగజైన్ కెక్కిది. తండ్రి సమర్ధించేవాడు. తల్లి మందలించేది. కూసింత దిగులుగా ఉన్నా తండ్రి ప్రోత్సాహంతో సెకండియర్ కంప్లీట్ చేసింది. తల్లి పట్టుబట్టి వామనరావుతో పెళ్ళిచేసింది. పెళ్ళి చూపులకొచ్చిన వామనరావుతో పర్సనల్గా మాట్లాడింది. పారిజాతం. తన కాలేజ్ మాగజైన్ కథలు వామనరావుకి చూపించింది. మెచ్చుకోలుగా చూశాడు. వామనరావు. పెళ్ళయ్యాక తన రచనా వ్యాసంగాలను ప్రోత్సహించాలని కండిషన్ పెట్టింది పారిజాతం. “తప్పకుండా” అంటూ తలగిర్రున తిప్పి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు వామనరావు.
డిగ్రీ పూర్తయ్యాక పారిజాతాన్ని కాపురానికి పంపించారు తల్లిదండ్రులు. పుట్టింటి వాళ్ళిచ్చిన.. డబుల్ కాట్, కిచెన్వేర్ నీట్ గా సర్దింది. తమ బెడ్రూమ్లో, హాల్లో రెండు ర్యాక్ లు కావాలి తనకు. భవిష్యత్తులో తను రాసిన బుక్స్ పబ్లిష్ అయితే వాటిలో భద్రపరుచుకోవాలి. వామనరావుకు టెండరేసింది. ర్యాక్స్ గురించి. “నిదానంగా కొందాం… తొందరేముంది… ముందు నువ్వు మంచి కథలు రాయి, పోటీలకు పంపించు… తరువాత వీలు చూసుకుని కొందాం..” సున్నితంగా పోస్ట్పన్ చేశాడు పారిజాతం ప్రపోజల్ని. అలిగింది పారిజాతం. తన అలక చూడడం అదే మొదటిసారి వామనరావుకి. మొండి చెయ్యదు కానీ ముఖం చూడలేం. కనిపెట్టలేని ఫీలింగ్స్ ఉంటాయి ఆ ముఖంలో, సాయంత్రం డ్యూటీ నుంచి ఇంటికొచ్చిన వామనరావు పారిజాతం ముఖం చూసి బిత్తరపోయాడు. పీల్చుకుపోయింది. భయపడ్డాడు. హాస్పిటల్కి వెళదామన్నాడు. వద్దన్నట్లు అడ్డంగా ఊపింది తల. ఎంత ఆలోచించినా తనకేమయిందో అంతుబట్టలేదు వామనరావుకి. బహుశా హెూం సిక్ అయ్యుండొచ్చు. రాత్రంతా నిద్రపట్టలేదు. పొద్దుటే నిద్రలేచి తన బాస్ కి ఫోన్ చేసి చెప్పేసాడు ఆరోజు లీవ్ కావాలని. తనకంటే ముందే నిద్రలేచి తనపని తాను చూసుకుంటోంది పారిజాతం. వేడివేడి కాఫీ తీసుకొచ్చి తన చేతికిచ్చిన పారిజాతం ముఖంలో మాత్రం సింగిల్ ఫీలింగ్… ఎలాంటి మార్పులేదు. ఆప్యాయంగా “పారు… ఇలారా…” పిలిచాడు. దగ్గరకొచ్చి నిలబడింది పారిజాతం. “మీ ఊరెళదామా… లీవ్ పెట్టేసాను… రెండు రోజులుండి వద్దువు గానీ” అన్నాడు. తల అడ్డంగా ఊపింది. ఊపుడు తప్ప ఎక్స్ ప్రెషన్ లేదు. “సరే కాస్త త్వరగా రెడీ అవ్వు మార్నింగ్పోకి వెళదాం… ఈరోజు మహేష్ బాబు సినిమా రిలీజ్” మళ్ళీ అదే ఊపుడు… నో ఎక్స్ప్రెషన్. తల గీరుకోబోయి తమాయించుకున్నాడు వామనరావు.
టిఫిన్లు పూర్తయ్యాయి. ఆలోచన్లు తనను తినేస్తుంటే తనేం తినగలడు. బలవంతంగా రెండి తిని ‘మమ’ అనిపించుకున్నాడు. పారిజాతం తిండిమీద అలగదు. ఎక్సప్రెషన్ అలేగా ఉంటుంది. గానీ శుభ్రంగా లాగించేస్తుంది. మళ్ళీ మొదలు పెట్టాడు వామనరావు ‘అక్కడికెళ్తాం…. ఇక్కడికెళ్లాం’ అని సేమ్ ఊపుడు. కాసేపు పేపర్ చదివి అటూ, ఇటూ దొర్లుతూ యథాలాపంగా వంటింటి వైపు. చూసాడు. గోడకు చేరగిలబడి తన కాలేజీ మ్యాగజైన్లో తను రాసుకున్న కథను తీక్షణంగా చదువుతోంది | ఫీలింగ్ మార్చకుండా.
అప్పుడర్ధమైంది. వామనరావుకి తను ఎందుకు అలిగిందో, రెండు ర్యాక్లు అడిగింది తను బెడ్రూమ్లో ఒకటి, హాల్లోకి ఒకటి తను రాయబోయే గ్రంథాలను భద్రపరచుకోను… ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని “పారు” అంటూ పిలిచాడు. తలతిప్పి చూసింది. పారిజాతం, “రెడీ అవ్వు ఫర్నిచర్ షాప్ కెళ్ళి రాక్స్ తెచ్చుకుందాం” అన్నాడు. ఎక్స్ ప్రెషన్లో ఫ్లోరీ మార్పు అయితే రాలేదు గానీ, కొంత మార్పు అయితే కనిపించింది వామనరావుకు, చేతిలోని కాలేజీ మాగజైన్ను భద్రంగా భగవద్గీతలా కళ్ళకద్దుకుని తన బ్యాగులో వర్దుకుంటూ బ్యాగ్ వైపు చూసింది ‘ఇక నీ అవసరం లేదులే’ అన్నట్టు.
లంచ్ టైమ్ కంతా రెండు ర్యాక్లు ఇంటికి చేరుకోవటం, వాటిని బిగించడం, పారిజాతం వాటికి పసుపు కుంకమ పెట్టి హారతివ్వడం జరిగిపోయాయి. ఆరు కాలేజీ మాగజైన్స్ లో మూడ్ బెడ్ రూమ్ రాక్ , మూడు హాల్లోని రాక్లో సమానంగా సర్ది వాటితో పాటు తెచ్చుకున్న ఎ4 సైజ్ పేపర్ బండిలను అరడజను పెన్స్ ను కూడా సమానంగా సం, వామనరావు వైపు చిరునవ్వుతో చూసింది. ఎక్స్ప్రెషన్లో భారీ మార్పు. తేలికపడింది వామనరావు మనసు బరువెక్కడానికి ఎంతో టైమ్ లేదని అతనికెక్కడ తెలుసు!
కాలంతో పోటీపడుతూ కదులుతోంది పారిజాతం పెన్ను. తన జీతంలో పారిజాతం పేపర్లకు, పెన్నులకు, డిష్టర్ పోస్టులకు కొంత బడ్జెట్ కేటాయించాడు వామనరావు. రోజు డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఒక కవరిని చెదిగా తనకిచ్చి ‘రిజిస్టర్ పోస్ట్’ చేసి తరువాత డ్యూటీకి వెళ్ళమనేది వామనరావుని పారిజాతం. మొదట ‘సరే’ అని తలూపినా…. డ్యూటీకి లేట్ అవుటంవల్ల పై ఆఫీసర్ తిట్లతో వాచిపోయేది వామన రావు ముఖం. పొరపాటున ‘రిజిస్టర్ పోస్ట్ రిసీట్’ పారిజాతానికి ఇవ్వడం మిస్ అయితే ఫీలింగ్స్ మారిపోయేవి పారిజాతానికి తలగీక్కోవడం ఎక్కువయింది వామనరావుకి. ఎలాగైనా ఈ విపత్తు నుండి బయటపడాలని ఓ మంచి ముహూర్తం చూసి బ్రతిమలాడాడు పారిజాతాన్ని…. “పారు ఇక నుంచి నువ్వెళ్ళు పోస్టాఫీసుక్… నాకు డ్యూటీకి రోజూ లేటవుతోంది… గతేడాది ప్రమోషన్ రాలేదు. ఈ ఏడాదికూడా రాకపోతే భవిష్యత్తులో పబ్లిష్ చేయబోయే నీ బుక్స్క ఫండ్స్ ఎక్కడ నుంచి తేను… ప్లీజ్ అర్ధం చేసుకో పారూ…” ధైర్యంచేసి అనునయించాడు. అర్ధం చేసుకున్న ఫీలింగ్ పారిజాతంలో స్పష్టంగా కనిపించింది వామనరావుకి, ‘సరే’ అన్నట్లు తలూపింది. పది ప్రమోషన్లు ఒకేసారి వచ్చినట్లు, పది దీపావళి మతాబులు ఒకేసారి వెలిగించినట్లు ఉబ్బి తబ్బిబయ్యాడు. వామనరావు.
ఈ క్రమంలోనే పోస్టాఫీసుతో అనుబంధం ఏర్పడింది పారిజాతానికి. దేవాలయానికైనా వెళ్ళకుండా ఉండగలదేమో గాని పోస్టాఫీసుకు వెళ్ళకుండా వుండలేదు తను. పుట్టింటిని మించిన అనుబంధం. తనకు పోస్టాఫీసుతో…. తన రిజిష్టర్ పోస్టు రిసీట్ ఇవ్వక పోయినా, తనకు తిరిగొచ్చిన కథలను క్షేమంగా తనింటికి చేర్చలేక పోయినా ఊరుకునేది కాదు పారిజాతం. పై అధికారులకు కంప్లెంట్ ఇచ్చేది. ఈ క్రమంలోనే సస్పెండ్ గురయ్యాడు లింగమూర్తి పాపం డ్యూటీలో చేరిన మున్నెళ్లకే.
ఇద్దరు మగపిల్లలు. పెరిగి పెద్దవారై హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. వామనరావు రిటైర్ అయ్యి ఇంటిపట్టున ఉండేవాడు. తను రాసిన కథలను పోస్ట్ చేస్తానన్నా ఒప్పుకునేది. కాదు. తనే వెళ్ళాలి పోస్టాఫీస్కి… అనుబంధం అలాంటిది. బెల్ మ్రోగితే రిటన్ పోస్ట్ ని కథను జాగ్రత్తగా తీసి పారిజాతం చెప్పిన మరో అడ్రన్ ఇంకో కవరిమీద రాసి పారిజాతనికి అందించడం… ప్రస్తుతానికి వామనరావుడ్యూటీ.
హైదరాబాద్ లో పిల్లలిద్దరు లింగంపల్లికి దగ్గరలో ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని అందులో ఉంటున్నారు. తల్లి.. పిచ్చిది, పాపం ఎలావుందో… తండ్రి రిటైర్ అయ్యాడు… తల్లితో ఎలా తంటాలు పడుతున్నాడో… ఎలాగైనా వాళ్ళిద్దరిని హైదరాబాద్ తీసుకొచ్చి తమ దగ్గర ఉంచుకోవాలన్న పట్టుదల పిల్లలిద్దరిలో ఎక్కువైంది.
వీకెండ్కి బయలుదేరి ఊరొచ్చారు. తల్లిదండ్రుల ఆనందాలకు అవధులు లేవు. రాత్రి భోజనాలయ్యాక తండ్రికి చెప్పారు మొట్టమొదట… హైదరాబాద్ వెళదాం…. అందరం కలిసి ఒక దగ్గరే ఉందాం…. అని. ఉలిక్కి పడ్డాడు వామనరావు.. తను వెళ్ళగలడు… కానీ పారిజాతం… అమ్మో పక్కవీధిలో ఉన్న పోస్టాఫీసుతో తనకున్న విడదీయరాని అనుబంధం… ఆలోచనలు చుట్టుముడుతుంటే… “ఓ సారి మీ అమ్మనడగండర్రా” అన్నాడు దీనంగా, తల్లిదగ్గరకు వెంటనే వెళ్ళబోతున్న పిల్లల్ని అవి “తెల్లారి మాట్లాడుకుందురులే” అన్నాడు నిద్ర చెడిపోతుందన్న భయంతో.
తెల్లారింది…. టిఫిన్లు పూర్తయ్యాక అందరూ హాల్లో కూర్చున్నారు. నిదానంగా లేవదీసారు పిల్లలు విషయాన్ని పారిజాతంతో… పిడుగులు, మెరుపులు కనిపించలేదు వాళ్ళకి పారిజాతం ముఖంలో… సేమ్… పాత ఎక్స్ ప్రెషన్…. సింగిల్ ఎక్స్ప్రెషన్. హైదరాబాద్లో తాముండే ఏరియాను వర్ణించారు…. పరిసరాల గురించి, వాతావరణం గురించి, పదడుగుల దూరంలో ఉండే హెడ్ పోస్టాఫీస్ గురించి… వింటున్న పారిజాతం ఎక్సప్రెషన్లో భారీమార్పు… “హెడ్ పోస్టాఫీస్ అంటే” అంటూ చూసింది పిల్లల వైపు, జాయినయ్యాడు వామనరావు… అందరూ ఎవరిపాటికి వారు వర్ణిస్తున్నారు హెర్పాస్టాఫీస్ గురించి. ఎండ్ డైలాగ్తో పూర్తిగా మారిపోయింది పారిజాతం ఎక్స్ ప్రెషన్.గతంలోంచి బయటకొచ్చాడు నామనరావు… మూడురోజుల క్రితం హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. ఎదురుగా పోస్టాఫీసు ఉందన్న ఆనందంకంటే… ఇంటి ఓనర్ తన కూతురి పెళ్ళి కోసం ఇల్లు ఖాళీ చెయ్యమన్నాడన్న బాధ చేస్తోంది పారిజాతాన్ని, పిల్లలు స్పీడ్గా వెతుకుతున్నారు మరో ఏరియాలో ఇల్లు. మంచి ఇల్లు దొరికింది కానీ…. అక్కడికి దగ్గర్లో పోస్టాఫీసు లేదు.
ఇల్లు ఖాళీచేసి దురో ఇంటికెళ్ళారు. సింగిల్ ఎక్స్ప్రెషన్ కంటిన్యూ… పిల్లలు రెడీ అయ్యి ఆఫీసుకెళ్ళారు. వామనరావు దిగులుగా కూర్చో ఉన్నాడు హాల్లో. గోడకానుకుని దిగులుగా కూర్చో ఉంది పారిజాతం, ఇంటి ముందు ఆటోవచ్చి ఆగింది. శేషగిరి తలుపు కొట్టాడు. తలుపు తీసాడు. వామనరావు. ఎవరు అన్నట్లు చూసాడు. మూడు అర్ధ నామాలు, ఓ నిలువు నామం పెట్టుకుని పద్దతిగా ఉన్నారు. శేషగిరి. “మీ పిల్లలు నన్ను జీతానికి కుదిర్చారు సార్.. రోజూ అమ్మగారిని పోస్టాఫీసుకి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి జాగ్రత్తగా చేర్చమని చెప్పారు” వినయంగా చెప్పాడు. వెలిగిపోయింది పారిజాతం ముఖం… “కూర్చో బాబు” అంటూ నాలుగిట్ల వేడివేడిగా ప్లేట్లో పెట్టి, నెయ్యి, కారప్పొడి వేసి తీసికొచ్చి శేషగిరికి ఇచ్చింది. వద్దని వారిస్తున్నా వినకుండా. ఈ రోజు నుంచి నువ్వు మా పుట్టింటే మనిషివన్నట్లు చూసింది. హ్యాపీగా లాగించేసాడు శేషగిరి. వామనరావు ఆనందానికి అవధుల్లేవు.
గబగబ రెడీ అయ్యి కవర్ తీసుకుని ఆటో ఎక్కుతూ …. చెప్పింది వామనరావుకి, ఆనందంగా చెయ్యి ఊపాడు వామనరావు, పోస్టాఫీసు ముందాగింది. ఆటో, నేనా చెట్టుకింద ఉంటాను. పనయ్యాక పిలవండమ్మా’ వినయంగా అన్నాడు.
పోస్టాఫీసులో కుడికాలు పెట్టి కౌంటర్ దగ్గరకు వెళ్ళబోతూ ‘పోస్టుమాస్టర్’ క్యాబిన్ వైపు చూసింది. ఒక్క క్షణం తేరిపార చూసిందతన్ని ‘లింగమూర్తి’ ఒకప్పుడు తనవల్ల సస్పెండ్ అయిన లింగమూర్తి.
ఇప్పుడు పోస్ట్ మాస్టర్. నిలువుగుడ్లేసుకుని నివ్వెరపోయి చూస్తున్నాడు లింగమూర్తి. సంతోషంగా అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది పారిజాతం. భయపడాల్సిన అవసరం లేదన్నట్లు తన కళ్ళతోనే భరోసా ఇచ్చిందతనికి తన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఛేంజ్ చేస్తూ, ఎన్నో ఏళ్ళ తర్వాత మారిన పారిజాతం ఎక్సప్రెషన్ని చూసి చిరునవ్వు నవ్వాడు లింగమూర్తి, రిజిస్టర్ పోస్ట్ చేసి రిసీట్ తీసుకుని బయటకొచ్చింది లింగమూర్తికి ‘బై..’ చెప్పి.
సర్ మని వచ్చి పారిజాతం ఇంటి ముందాపాడు ఆటోను శేషగిరి. ఇంటి ముందు ఆటోదిగి శేషగిరికి సంతోషంగా ‘బై…’ చెబుతున్న పారిజాతం ఎక్సప్రెషన్ను చూసి బిత్తరపోయాడు వామనరావు. తనకు ఇప్పుడు ఇద్దరు తోబుట్టువులు దొరికారని, వారే లింగమూర్తి, శేషగిరి అని చెప్పింది వామనరావుకి. గతేడాది దీపాళికి కాల్చకుండా మిగిలిపోయిన మతాబులను బయటకు తీసి ఎండలో ఆరబెట్టాడు. వామనరావు…. రాత్రి పిల్లలొచ్చాక దీపావళి చేసుకోవాలని,
Greetings from India Toons