“Jakkapur Jakkanalu” Book Launching & ZPH School Bukkapur, Siddipet Students Art Exhibition Conducted by Akshara Sedyam Foundation.

“Jakkapur Jakkanalu” Book Launching & ZPH School Bukkapur, Siddipet Students Art Exhibition Conducted by Akshara Sedyam Foundation.

అందమైన ఊహలకు అధ్బుతమైన రూపమివ్వడానికి చక్కని సాధనమే చిత్రలేఖనము.అందులోనూ చిన్నారులు వేసిన బొమ్మలు చూడముచ్చటగా ఉంటాయి.బొమ్మలు వేయడం అంటే పిల్లలకు ఎంతో ఇష్టం. జక్కాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కథలు,కవితలు వ్రాసి రాష్ట్ర స్థాయిలో బహుమతులు పొందడమే కాదు అందమైన, ఆలోచనాత్మక మైన బొమ్మలు వేయగలరని నిరూపించారు. వివిధ పత్రికల్లో ప్రచురితమైన 120 బొమ్మలతో ఈ పుస్తకాన్ని రూపొందించడం చాలా సంతోషంగా ఉన్నది.

తేదీ.09.04.2021 నుండి 22.09.2022 వరకు ఈనాడు హాయ్ బుజ్జీ -94,నమస్తే తెలంగాణ అల్లరి -9,చెకుముకి -13, బాల భారతం (నవంబర్ 2020) -1, నిత్య -2,గడుగ్గాయ్ -1 ప్రత్రికల్లో ప్రచురితమైనవి.ఈ సందర్భంగా ఆ పత్రికల సంపాదకులకు కృతజ్ఞతలు.విద్యార్థులు వేసిన ప్రతి బొమ్మ ను అభినందించిన సర్వశ్రీ డా.మొసర్ల మాధవరెడ్డి, మేరెడ్డి రవిప్రకాష్,యాది, గరిపెళ్లి అశోక్ ,తోట మధుసూదన్,ఆనంద్ శ్రీనివాస్ మరియు అభినందనలు తెలియచేసిన ఆత్మీయులు అందరికి ధన్యవాదములు.


జక్కాపూర్ విద్యార్థులు కథలు వ్రాయగలరు, కథలకు తగిన బొమ్మలు వేయగలరు,బొమ్మలకు తగిన కథలు వ్రాసి పదిమంది మెప్పు పొందగలరు. ఇంతటి అద్భుతమైన బొమ్మలు వేసిన విద్యార్థులు,పత్రికలో ప్రచురణ కాకున్నా మంచి బొమ్మలు వేసిన మిగతా విద్యార్థులు అందరికి శుభాశీస్సులు. విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు,పాఠశాల శ్రేయోభిలాషులకు,76 మంది విద్యార్థులకు చిత్రలేఖన సామాగ్రి అంద చేసిన జక్కాపూర్ గ్రామ వాస్తవ్యులు శ్రీ పెద్దన గారికి కృతజ్ఞతలు.ఇటువంటి విద్యార్థుల సృజనాత్మక అంశాలను వెలికి తీయడంలో సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రాళ్లబండి పద్మయ్య మరియు నిరంతరం నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న ఆత్మీయ ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు.


బొమ్మలు వేస్తున్న చిన్నారి విద్యార్థులను అభినందించడమే కాకుండా ,వారు వేసిన బొమ్మలను ఒక పుస్తకముగా రూపొందించడానికి చేయూత నిచ్చిన పాఠశాల శ్రేయోభిలాషులు,పూర్వ ఉపాధ్యాయులు శ్రీ తోరటి రఘురంజన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.


2019 మార్చి లో విద్యార్థులు వ్రాసిన 32 కథలతో “జక్కాపూర్ బడిపిల్లల కథలు ” పుస్తకము మొదటి పుస్తకం. 2020 మార్చ్ లో విద్యార్థులు వ్రాసిన 74 కవితలతో “మధుర పద్మాలు ” పుస్తకం రెండవది. ఇప్పుడు మూడవ పుస్తకం ఈ “జక్కాపూర్ జక్కనలు “.అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ…..

 

 

 

Courtesy: భైతి దుర్గయ్య
SA హిందీ
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
జక్కాపూర్-సిద్దిపేట జిల్లా
తెలంగాణ -ఇండియా
సెల్ – 9959007914

Greetings from India Toons