
‘ఆర్ట్ బార్’ డ్రాయింగ్ మరియు పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ ఏప్రిల్ 25 నుండి మే 25 వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్లో డ్రాయింగ్, పెయింటింగ్, మండలం ఆర్ట్ మరియు హ్యేండ్ రైటిగ్(తెలుగు,ఇంగ్లీష్ )లో ఎంతో మంది బాలబాలికలు శిక్షణ పొందారు.
వారు వేసిన బొమ్మలు ఈ రోజు అనగా జూలై 3-7-2022న శ్రీ విజయ సీనియర్ సిటిజన్ అసోషియేషన్, హుడా పార్క్ దగ్గర, విజయ నగర్ కాలనీ, కూకట్ పల్లి లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా శ్రీమతి స్వరూప రాణి గారు (టీ. ఆర్. ఎస్. ప్రెసిడెంట్, విజయనగర్ కాలనీ), ప్రముఖ కార్టూనిస్టులు సరసి గారు, లేపాక్షి గారు, ప్రసిద్దా గారు, ప్రసాద్ కాజా గారు, శరత్ బాబు గారు, అశ్వక్ గారు మరియు సీనియర్ సిటిజన్ కమిటీ మెంబర్ మంగయ్య గారు పిల్లకు డ్రాయింగ్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు.
పిల్లలకు బొమ్మలు వేయడంలో మెళకువలను సరసి గారు, రాజశేఖర్ గారు బ్లాక్ బోర్డు పై గీసి చూపించారు.
అనంతరం ప్రశంస పత్రాలు బహుకరించారని ఆర్ట్ బార్ డైరెక్టర్ రాజశేఖర్ తెలియజేశారు.




Courtesy: Mr.Rajasekhar Reddy
Greetings from India Toons