
Bathula Bapuji


*ఈయన వృత్తి కళాకారుడు కాదు. కానీ…..,
అంతకు మించి.. చిత్రకారుడు..!!
*IAS కావాల్సిన వాడు..చిత్రకారుడయ్యాడు…!!
*75యేండ్ల వయస్సులో కూడా వన్నెతగ్గని …..
కళా తృష్ణ..!!
*కళ్ళల్లో వత్తులు వేసి చూడదగ్గ చిత్రాలను
చిత్రించిన చిత్రకారుడు…” బత్తుల బాపూజి “.
(Battula Bapuji)
*ఉద్యోగ విరమణానంతరం…మొగ్గ విచ్చిన
చిత్రలేఖనం…!!
*తూర్పు గోదావరి జిల్లా (ఆంధ్రప్రదేశ్) లోని మల్కీ
పురం..( Andhra Pradesh, (India) East
Godavari district, Malkipuram )లో జూలై
20,1946 లో జన్మించారు…బత్తుల బాపూజీ.
ప్రస్తుతం హైదరాబాద్ ,పుప్పాల గూడ,మణికొండ (తెలంగాణ ) (Hyderabad,Telangana ,India.)
లో నివాసముంటున్నారు.
ఎ.ఎఫ్.డి.టి హైస్కూల్ ,మల్కీపురం (తూగోజి)
(AFDT High school, Malkipuram (E.G
Andhra Pradesh)లో ప్రాథమిక విద్యాభ్యాసం.
కె.ఎస్.ఓ .యు మైసూర్ (కర్ణాటక),ఢిల్లీ విశ్వవిద్యా
లయం,ఆంధ్రా యూనివర్సిటీ (విశాఖపట్నం) ఉస్మా
నియా యూనివర్సిటీ(హైదరాబాద్)Ksou Mysore,
University of Delhi, Andhra university (Visa
khapatnam (Ap) , Usmania university,(Hyd
era bad(TS) లలో ఉన్నత చదువులు చదివారు.


NCDC,A..Govt of India..Corportion.లో
చీఫ్ డైరెక్టర్ (Chief Director ) గా పనిచేశారు.
2006లో సర్వీసు నుంచి రిటైర్ అయ్యారు. అప్పటి
నుండి విశ్రాంత జీవితంలో … అవిశ్రాంతంగా చిత్రం
లేఖనాన్ని కొనసాగిస్తున్నారు.ఒకటి కాదు రెండు కాదు…కొన్ని వందల చిత్రాలు, స్కెచ్ లు, పోర్ట్రైట్ లు, సృజనాత్మక చిత్రాలు వేశారు.ఇంకా వేస్తూనే …
వున్నారు.ఆయన కుంచెకు విశ్రాంతి అన్నదే లేదు.
ఆకాశమే హద్దుగా ఆయన చిత్ర కళా తృష్ణ కొన
సాగుతూనే వుంది.
*చిత్రలేఖనం..వారసత్వమే..!!
బాపూజీ గారికి చిత్రలేఖనం వారసత్వంగా వచ్చిందే.
వీరి తాతగారు చిత్ర కారుడు. బాల్యంలో…’ వుడ్ కార్వింగ్’ చేసే పనిని చూసి, ప్రభావితుడై గోడలపై లతలు, పుష్పాలు, సన్నని డిజైన్ లు బొగ్గుతో గీసే
వారట. అలా తాతగారి చిత్రలేఖనం బాపూజీ గారి
కి వారసత్వంగా వచ్చింది.అయితే…బాపూజీ తండ్రి గారు మాత్రం కొడుకు చిత్రకళాభిలాషకు బ్రేక్ వేశా
రు.తన కొడుకు పెద్ద చదువులు చదివి,IAS ఆఫీసర్ కావాలన్నది ఆయన బలమైన కోరిక.అందుకే నిత్యం
చదువు… చదువు అంటూ….బాపూజీ పై ఒత్తిడి తెచ్చేవారు. ” నిన్ను IAS గా చూడాలని వుంది “,
అంటూ…పదే పదే పరితపించేవారట.
ఎలిమెంటరీ స్కూల్, తర్వాత ఇంటర్, డిగ్రీ చదువు
ల కాలంలోనే,అలనాటి ప్రఖ్యాత చిత్రకారులు”అంకా
ల వెంకట సుబ్బారావు గారితో పరిచయం జరిగింది. ఆయన దగ్గర ఏవో చిన్న చిన్న మెళుకువలనుతెలు
సుకోవడం తప్ప,పెద్దగా నేర్చుకున్నదేమీ లేదు.సాధ్య
మైనంతవరకు చిత్రలేఖనాన్ని స్వయంకృషితో,తప
న, పట్టుదలతో సాధించారని చెప్పొచ్చు.


‘బత్తుల బాపూజీ ‘….చదువులో చాలా చురుకుగ్గా వుండేవారు. తన తండ్రి కోరిక ప్రకారం IAS కాలేదు కాని, ఎన్నో ఉన్నత హోదాగల ఉద్యోగాలు చేశారు.
ప్రపంచ బ్యాంకు పథకంలో …ఉపసంచాలకునిగా,
తర్వాత రాష్ట్ర ఇన్ చార్జ్ గా హైదరాబాద్ కు బదిలీ అయ్యారు.చివరకు NCDC,A..Govt of India..
Corportion లో, అడిషనల్ సెక్రటరీ స్థాయిలో చీఫ్
డైరక్టర్ గా 2006 లో పదవీ విరమణ చేశారు. తర్వా
త వీరి పెద్దకుమారుడు(అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజ
నీర్) నూతన్ కుమార్ తన తండ్రి బాపూజి గారిలోని చిత్రకళను ప్రోత్సాహించాడు.ఓ కొడుకు నుంచితండ్రి
కి ఇటువంటి ప్రోత్సాహం లభించడం అరుదైన విష
యం.తండ్రి చిత్రలేఖనానికి కావలసిన ఆర్ట్ మెటీరి
యల్ ను అమెరికాలోని ‘విన్సర్ & న్యూటన్ కంపె
నీ’నుంచి పంపేవాడు.అలా నాణ్యత గలిగినకాన్వాస్
రోల్స్, వాటర్, ఎక్రలీక్, ఆయిల్ కలర్స్ సైజ్ లవారీగా
గల రంగుల డబ్బాలు, బ్రష్ లు ఇలా కావలసినంత
మెటీరయల్ తో ఇంటిని నింపేసేవాడు.
“ఉద్యోగవిరమణ తర్వాత ఖాళీగా ఉంటున్న నాలో వున్నా చిత్రకళాసక్తిని గమనించి, నన్ను ప్రోత్సహిస్తు
న్న కొడుకు దొరకడం నిజంగా నా అదృష్టం” అంటూ
మురిసిపోతుంటారు… బాపూజీ గారు.
*ప్రపంచ స్థాయి చిత్రకారుడు…!!
వృత్తి కళాకారుడు కాకున్నా…అరవైలో కుంచెకు
పదును పెట్టి అచిరకాలంలోనే ప్రపంచస్థాయి చిత్ర
కారుడిగా ఎదగడం చిన్న విషయం కాదు. అయితే
బత్తుల బాపూజీ గారి విషయంలో ఇది నిజమైంది.
ఆయన చిత్రాలు రాష్ట్ర,దేశం సరిహద్దులు దాటి …
వెళ్ళాయి..ఎక్కడకు వెళ్ళినా…ప్రశంసలతో పాటు
అవార్డుల్నీ మూటకట్టుకొచ్చేవి. చిత్రాల్లోని వైవిధ్య
మే బాపూజీ కుంచె బలంగా చెప్పొచ్చు.
*సృజనాత్మక చిత్రాలే ఇష్టం..!!
చిత్రకారుడిగా సృజనాత్మక చిత్రాల్ని వేయడమే….
ఆయనకిష్టం.అయితే అప్పుడప్పుడు అనుకరణ
చిత్రాల్ని కూడా వేస్తుంటారు. ఈయన రియలిస్టిక్
చిత్రాలకు పెద్ద పీట వేస్తారు.
ముఖ్యంగా..బుద్ధుడి చిత్రాలు ఈయన కుంచెలో
కొత్త రూపాన్ని సంతరించుకోవడం విశేషం.బుధ్ధు
డిలోని శాంతి ఈయన చిత్రాల్లో ఎక్కువగా ప్రతి
బింబిస్తోంది.
ప్రఖ్యాత యూరోపియన్ చిత్రకారుల ప్రభావంతో , తనదైన శైలిని జోడించి చిత్రాలను,వేయడంలో..
ఈయన దిట్ట.
*బాల్ పెన్ పోర్ట్రైట్ లు.. ప్రత్యేకం..!!
బాల్ పెన్ తో గొప్ప పోర్ట్రైట్ లు వేయడం ఈయన
ప్రత్యేకత…ఒకటా రెండా వందల సంఖ్యలో బాల్
పెన్ పోర్ట్రైట్ లు వేశారు.సామాన్యుల నుండిమాన్యు
లో వరకు ఈయన పోర్ట్రైట్ లలో కనిపిస్తారు.దేశం
లోని ప్రముఖ రాజకీయనాయకులంతా ఈయన
చిత్రాల్లో కనిపిస్తారు.అలాగే సినీ నటులు,సాంస్కృ
తిక సారధులు, వ్యాపార దిగ్గజాలు ,ప్రముఖులు
ఈయన చిత్రాల్లో దర్శనమిస్తారు.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, నెల్సన్ మండే
లా, మదర్ థెరిసా, అబ్దుల్ కలామ్, బిల్ గేట్స్,సత్య
నాదెళ్ళ, గూగుల్ CEO సుందర్ పిచాయ్, చిత్రరం
గానికి చెందిన నిర్మాతలు, దర్శకులు, కవులు ఇలా
ఎందరో మహానుభావులు….అందరికీ వందమన్నట్లు
బాపూజీ చిత్రీకరించిన తీరు అమోఘం.వర్ణనాతీతం.
బాపూజీ గారి ఇల్లే..ఓ ఆర్ట్ గ్యాలరీని మించి ……
వుంటుంది.
*అవార్డులు… రివార్డులు..!!

చిత్రాలు చిత్రించడం ఒక ఎత్తయితే, వివిధ పోటీల ద్వారా ప్రదర్శించి బహుమతులందుకోవడం మరో
ఎత్తు. హైదరాబాద్ లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలోను, రెయి
న్ బో ఆర్ట్ గ్యాలరీలోను, విజయవాడలో ఐకాన్ ఆర్ట్ గ్యాలరీలోను, అమలాపురంలో కోనసీమ చిత్రకళా
పరిషత్ లోను తన ప్రదర్శనల ద్వారా అవార్డులు,
పురస్కారాల్నీ అందుకున్నారు. సెవెంటీ ప్లస్ వయ
సులో వెంకటేశ్వరా కాలేజ్ ఆఫ్ ఫైనార్ట్స్ కేంద్రంగా కర్ణాటక రాష్ట్ర సారస్వత్రిక విశ్వవిద్యాలయం నుండి ఎమ్.ఎఫ్.ఏ కోర్సు చేస్తున్నారు. చిత్రకళ పై ఆసక్తి మాత్రమే కాదు,కొత్తగా ఇంకా ఏదో నేర్చుకోవాలని తపన పడుతుంటారు. జ్ఞాన సముపార్జనకు వయ
సుతో ఏమాత్రం సంబంధం లేదంటారాయన.నిజా
నికి వయోభారంతో సరిగా కదలని స్థితిలో ఉన్నప్ప
టికీ చిత్రం కళ పట్ల ఆసక్తి ఏమాత్రం తగ్గడం లేదం
టారాయన.. వివిధ ప్రపంచదేశాల ఆర్ట్ గ్రూపుల్లో
సభ్యులుగా వుండి, పోటీలలో తనచిత్రాలను పోస్ట్ చేస్తుంటారు. బాపూజీ వేసిన పేయింటింగ్స్ కు నాలు
గు వందలకు పైగా అవార్డులు వచ్చాయంటే..చిత్ర
లేఖనం పట్ల బాపూజీ అంకితభావం,ఆసక్తి ఎంతో
అంచనా వెయ్యొచ్చు..
*అవార్డులు… రివార్డుల వివరాలు…!!
*Million HEART OF FINE ART CONTEST
Group,(Chicago,USA) లో సెకండ్ ప్లేస్…!!
*International Master Art Award
*Portrait won a third prize in the 5th National level Art Exhibition of the Shri Ajanta Kalaramam,Tenail, at Hyderabad .
*world painter contest..golden brush award.
*ART LEGEND AWARD for painting from KONASEEMA CHITRALAKA PARISHAD,.
*One more International Art credit to portrait.
DIAMOND GRADE award from…..
” Great International Art Gallery .
*Paintings on display in the ‘ State Art Gallery,’ Hyderabad,on the occasion of 12th Annual day Art & crafts Mela from 26 th to 31st Jan 2016.
*Participated with a painting along with other artists Chitramayee State Gallery of Art , Hyderabad art exhibition .
ఇలాంటి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు,
ప్రశంసా పత్రాలు..సమ్మానాలు ఎన్నో..ఎన్నెన్నో …!!
విశిష్ట చిత్రకారుడు..బత్తుల బాపూజీ గారికి …
అభినందనలు
Courtesy:ఎ.రజాహుస్సేన్.