తానా – మంచి పుస్తకం నిర్వహణలొ, పదెళ్ళ లొపు పిల్లలు కొసం తెలుగులొ బొమ్మల కధల పుస్తకాలు-2021

ఉత్తర అమెరికా తెలుగు సంఘం – తానా(TANA) 23వ మహాసభలు 2021 జూలై 2,3,4 తేదీలలో ఫిలడెల్ఫియా నగరంలో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా తానా వివిధ సాహిత్య కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా బాలసాహిత్యాన్ని ప్రోత్సహించడం కోసం మంచి పుస్తకం (హైదరాబాద్) సంస్థతో కలిసి “పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తక పఠనం పై ఆసక్తిని పెంపొందించేందుకు తానా(TANA) వారు మంచి పుస్తకం సంయుక్తంగా బొమ్మల కథల పుస్తకాన్ని అందించాలి అనే దృక్పధంతో ‘పదేళ్లలోపు పిల్లల కోసం బొమ్మల కథలు-2021కు రచనలు ఔత్సాహికులు నుండి ఆహ్వానిస్తుంది. పుస్తకం (1/4 క్రౌన్ సైజు, 18X24 సెం. మీ.) ఇన్నర్ టైటిల్, ఇన్ ప్రింట్ పేజీతో సహా 24 పేజీలు (పోట్రైట్ లేదా ల్యాండ్ స్కేప్ లో) ఉండాలి. అదనంగా కవర్ పేజీలు ఉంటాయి.
ఒకొక్క పేజీలో 10-12 వ్యాఖ్యలకు మించి ఉండకూడదు. కధ చదవటానికి సరదాగా, హాయిగా ఉండాలి; తమాషాగా అనిపించాలి. తల్లిదండ్రులు లేదా పెద్దవాళ్లు పిల్లలకు చదివి వినిపించేలా పుస్తకం ఉండాలి, పుస్తకం ప్రధాన ఉద్దేశ్యం నీతిని బోధించటంకు మాత్రమే పరిమితం కాకుండా పిల్లలలో పుస్తకాలను చదవాలనే అభిలాషను కలిగించటమే పుస్తకం యొక్క ప్రధాన లక్ష్యం అని గమనించాలి.
కథ, బొమ్మలు ఒకరే కానీ బృందంగా ఏర్పడి కానీ పంపించవచ్చును, కధ మాత్రమే వ్రాయగలిగి బొమ్మలు వేయలేని వారి కథలు ఎంపిక అయిన పక్షంలో వారి బొమ్మలు వేయించే బాధ్యత మాది.
ఎంపిక ప్రక్రియ 3దశలలో ఉంటుంది, మొదటిదశగా మొత్తం కథ మరియు కథకు సంబంధించిన బొమ్మలు కలిపి 2020 నవంబర్ 30 తేదీలోపు పంపాలి, ఇక రెండవ దశలో 10 కథలును ఎంపిక చేసి ఒక పుస్తకానికి కథ మరియు బొమ్మలు వేసినవారికి పదివేల రూపాయల పారితోషకం అందజేస్తాము. 2021 మార్చి31తేదీ లోపు బొమ్మలతో పూర్తిచేసి, ముద్రణకు సిద్ధంగా ఉన్న పుస్తకాన్ని అందజేయాలి. ఈ పుస్తకాలన్నింటిని తానా – మంచి పుస్తకం కలిసి 2021 జూలై నాటికి ప్రచురిస్తాయి, కథ, బొమ్మలపై కాపీరైటు ఆయా రచయితలు మరియు చిత్రకారులుకే ఉంటాయి.
గమనిక: నిర్వాహకులు నిర్ణయాలపై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు.
మీ రచనలు పంపవల్సిన చిరునామా
మంచి పుస్తకం, #12-13-439, వీధి నంబర్:1, తార్నాక, సికింద్రాబాద్ 500017
ఈ మెయిల్: info@manchipustakam.in
అదనపు వివరాలకు సంప్రదించగలరు:
1.కె.సురేష్:9963862926
2.వాసిరెడ్డి నవీన్: 9849310560
Courtesy:
1. జయశేఖర్ తాళ్లూరి (తానా అధ్యక్షులు)
2.కన్నెగంటి చంద్ర (తానా ప్రచురణల కమిటీ చైర్మన్)
3. జంపాల చౌదరి (కార్యక్రమ నిర్వాహకులు)
4. కె. సురేష్ (మంచి పుస్తకం)

BEST WISHES FROM: INDIATOONS